అరసవల్లిలో రథసప్తమి వేడుకలు

అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి.

Update: 2026-01-25 02:51 GMT

అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. పెద్దయెత్తున భక్తులు తరలి వచ్చారు. అర్ధరాత్రి 12:05 గంటలకు రథసప్తమి తొలిపూజ నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలు మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు సమర్పించారు. అరసవల్లి సూర్యనారయణ స్వామిని మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ లు దర్శించుకున్నారు.

పెద్ద సంఖ్యలో భక్తులు...
ఉదయం 7:30 వరకు స్వామివారి మూలవిరాట్‌కు క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిజరూప దర్శనం ఉంటుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రథసప్తమికి పెద్దయెత్తున భక్తులు తరలి వస్తారని భావించి ఆలయ అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ను నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News