Vijaya Sai Reddy : సాయిరెడ్డి చేరే పార్టీ అదేనా? క్లారిటీ వచ్చేసినట్లేగా?
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ ఏడాది జూన్ తర్వాత రాజకీయంగా యాక్టివ్ అవుతానని చెప్పారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ ఏడాది జూన్ తర్వాత రాజకీయంగా యాక్టివ్ అవుతానని చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. తాను సొంత పార్టీ పెడుతున్నట్లు వార్తలను అయితే విజయసాయిరెడ్డి ఖండించారు. కానీ ఆయన నాలుగు పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు హాజరయిన విజయసాయిరెడ్డి తర్వాత మీడియాతో మాట్లాడిన మాటలను చూస్తే ఏ పార్టీ అన్నది కొంత స్పష్టత వచ్చింది. జగన్ ను విమర్శించలేదు. అలాగని జగన్ చుట్టూ ఉన్న కోటరీ గురించి మరోసారి ప్రస్తావించారు. అంటే వైసీపీలో చేరే అవకాశాలు లేవనే కనపడుతుంది.
చంద్రబాబుపైనా విమర్శలు...
మరొకవైపు తెలుగుదేశం పార్టీ లో చేరతారా? అనుకుంటే చంద్రబాబు నాయుడు పైన కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తనను వేధిస్తుందని అంటున్నారు. అదే సమయంలో జగన్ మాదిరిగానే ఇరవై ఇరవై ఐదేళ్లు తమదే అధికారం అనుకుంటే అది తప్పవుతుందని, ప్రజలు ఎప్పుడు ఎలా తీర్పు ఇస్తారో చెప్పాలేమని అన్నారు. చంద్రబాబుపై కూడావిమర్శలు చేయడంతో ఆయన టీడీపీలో చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లే అనుకోవాలి. ఇక జనసేనలో చేరాలంటే పవన్ కల్యాణ్ తో సత్సంబంధాలున్నప్పటికీ విజయసాయిరెడ్డిని చేర్చుకునే ధైర్యం పవన్ కల్యాణ్ చేయకపోవచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి విషయంలో పవన్ కు ఒక క్లారిటీ ఉంది. జగన్ కోవర్టుగానే అనుమానిస్తారు.
అదే పార్టీలోనూ...
జగన్ ను లిక్కర్ స్కామ్ గురించి తెలియదని, ,జగన్ కు తెలిస్తే ఒక్క రూపాయి స్కామ్ ను కూడా అంగీకరించరని చెప్పడం కొంత అనుమానాలకు తావిస్తున్నప్పటకీ కూటమి కలిసివున్నంత కాలం వైసీపీ గెలవలేదని, కూటమిని ఓడించే స్ట్రాటజీ తెలిసినవాళ్ళు ఆపార్టీలో లేరని చెప్పడంతో వైసీపీలో కూడా చేరే ఆలోచన విజయసాయిరెడ్డి చేయకపోవచ్చు. ఇక ఆయనకు మిగిలింది ఒకే ఒక ఆప్షన్.బీజేపీ. బీజేపీ లో చేరడానికి అవసరమైన కసరత్తులు ఇప్పటికే ప్రారంభమయినట్లు తెలిసింది. బీజేపీకి కూడా బలమైన రెడ్డి సామాజికవర్గం నేతలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అవసరం.అందుకే విజయసాయిరెడ్డి కమలం తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద సాయిరెడ్డి రీ ఎంట్రీపై మరో ఐదు నెలల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.