నేడు మహారాష్ట్రలో పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు

Update: 2026-01-25 04:19 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో పవన్ కల్యాణ్ పర్యటన సాగుతుంది. నాందేడ్ లోని గురుద్వారాలోని సిక్కు దస్తార్ ధారణను పవన్ కల్యాణ్ చేయనున్నారు. అనంతరం దర్బాసాహిబ్ లో ప్రత్యేక ప్రార్థనలను పవన్ కల్యాణ్ చేయనున్నారు. ఉదయం 8.30 గంటలకు బయలుదేరి నాందేడ్ వెళ్లారు.

దర్గాసాహిబ్ కార్యక్రమాల్లో...
అనంతరం దర్గాలో సేవా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. పవన్ కల్యాణ్ చౌర్ సాహిబ్ సేవ, అర్ధాన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ కు అక్కడ సత్కారం జరగనుంది. అలాగే మధ్యామ్నం 2.10 గలకు శ్రీగురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ 350వ షహీదీ సమాగంలలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు నాదేండ్ నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.


Tags:    

Similar News