గన్నవరం విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం
గన్నవరం నుంచి బెంగళూరు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.
గన్నవరం నుంచి బెంగళూరు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి బెంగళూరు వెళుతుండగా టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఫ్యాను రెక్కలకు పక్షి తగిలడంతో ఈ ప్రమాదం జరిగింది. పక్షి తగలడంతో టేకాఫ్ అవుతున్న విమానం ఫ్యాన్ తిరగడం ఆగిపోవడంతో పైలెట్ అప్రమత్తం అయ్యారు.
పక్షి తగలడంతో...
చాకచక్యంగా గన్నవరం విమానాశ్రయం రన్ వే పై సేఫ్ పైలెట్ లాండింగ్ చేశారు. విమానంలో దాదాపు వందమంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. విమానం లో తలెత్తిన లోపాన్ని సరిచేయడానికి సుమారు 2, 3 గంటలు సమయం పడుతుందని తెలియడంతో బెంగళూరుకు వెళ్లాల్సిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఫ్లైట్ను ఏర్పాటు చేస్తున్నారు.