నేడు గుంటూరు కోర్టుకు అంబటి

నేడు అంబటి రాంబాబును గుంటూరు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు

Update: 2026-02-12 02:58 GMT

మాజీ మంత్రి అంబటిని కేసులు వెంటాడుతున్నాయి. నేడు అంబటి రాంబాబును గుంటూరు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. రాజమండ్రి జైలు నుంచి పోలీసు వాహనంలో అంబటి రాంబాబును తీసుకుని పోలీసులు బయలుదేరారు. అంబటి పై మరో పిటి వారెంట్ పిటిషన్ పోలీసులు దాఖలు చేశారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు పేరుతో లక్కీ డ్రా అంటూ మోసం చేశారని, లాటరీ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి న అంబటి పై ఫిర్యాదు అందింది.

పీటీ వారెంట్ పై...
అంబటి రాంబాబు పై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. జగాదే వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో 2023లో అంబటి పై సత్తెనపల్లి పిఎస్ లో కేసు నమోదయింది. అంబటి రాంబాబును కోర్టులో హాజరు పరచాలని జడ్జి ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు అంబటి ని కోర్టులో సత్తెనపల్లి పోలీసులు హాజరుపరచనున్నారు.


Tags:    

Similar News