Breaking : జైలు నుంచి విడుదలయిన అంబటి రాంబాబు
మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు. అంబటి రాంబాబుకు బెయిల్ లభించడంతో ఆయన రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు. సత్తెనపల్లిలో లక్కీ డ్రా తీసి సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. దీంతో న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్ పత్రాలను రాజమండ్రి జైలు అధికారులకు అంబటి తరుపున న్యాయవాదులు అందించారు.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటా...
జైలు నుంచి విడుదలయిన మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తనను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. అన్నింటికీ ఆ దేవుడే సమాధానం చెబుతారని అన్నారు. ఎన్ని రోజులైనా జైలలోనే ఉందామని వెళ్లానని అన్నారు. ఎలాంటి పరిస్థితులునైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అంబటి రాంబాబు మీడియాకు తెలిపారు. పద్దెనిమిది రోజులు జైల్లో పెడితే తాను భయపడతానని అనుకున్నానని అన్నారు. తాను భయపడేది లేదన్నారు. ఎక్కడో జరిగిన పొరపాటుకు తనపై కేసు నమోదు చేశారన్నారు. రాజమండ్రి జైలు తన పట్టుదలకు శిక్షణగా మారిందని అంబటి రాంబాబు తెలిపారు.