అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల ఎప్పుడంటే?

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరయింది.

Update: 2026-02-11 11:36 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరయింది. అయితే ఈరోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవు. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటుపరం చెయ్యొద్దంటూ ర్యాలీ నిర్వహించిన వ్యవహారంలో సీఐ విధులను అడ్డుకున్నారని అంబటి రాంబాబు పై అక్రమ కేసు నమోదయింది.

బెయిల్ రావడంతో...
ఈ కేసులో పిటి వారెంట్ ద్వారా మూడు రోజుల క్రితం పట్టాభిపురం పోలీసులు కోర్టులో హాజరపరిచగా న్యాయమూర్తి పథ్నాలుగు రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు ఇప్పటికే బెయిల్ మంజూరు కావడంతో రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.


Tags:    

Similar News