శ్రీవారి దర్శనానికి రెండు రోజులు

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి వెలుపలకు మూడు కిలోమీటర్ల మేర లైను కొనసాగుతుంది.

Update: 2022-10-07 02:25 GMT

తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వరస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి వెలుపలకు మూడు కిలోమీటర్ల మేర లైను కొనసాగుతుంది. ఈరోజు స్వామి వారి దర్శనానికి ముప్ఫయి గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

వసతి సౌకర్యం...
నిన్న తిరుమల శ్రీవారిని 72,195 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41,071 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.17 కోట్ల రూపాయలు అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శని, ఆదివారాలు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దర్శనం మాట అలా ఉంచితే భక్తులకు వసతి దొరకడం కూడా కష్టంగా మారింది.


Tags:    

Similar News