నేడు న్యాయస్థానానికి అద్దేపల్లి జనార్థన్ రావు

తంబళ్లపల్లి ములకలచెరువు కల్తీ మద్యం కేసులో అరెస్ట్ చేసిన అద్దేపల్లి జనార్థన్ ను ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు

Update: 2025-10-11 04:59 GMT


తంబళ్లపల్లి ములకలచెరువు కల్తీ మద్యం కేసులో అరెస్ట్ చేసిన అద్దేపల్లి జనార్థన్ ను ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టులో అద్దేపల్లి జనార్థన్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఎక్సైజ్ పోలీసులు అద్దేపల్లి జనార్థన్ ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ములకలపల్లి కల్తీ మద్యం కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
కల్తీ మద్యం కేసులో...
అద్దేపల్లి జనార్థన్ రావు ఆఫ్రికాకు వెళ్లి తిరిగి విజయవాడకు చేరుకుంటున్నారన్న సమాచారంతో ఆయనను గన్నవరం ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. తంబళ్లపల్లి ములకలచెరువు కల్తీ మద్యం కేసులో జనార్థన్ రావు ఏ1 నిందితుడిగా ఉన్నారు. అయితే నిన్న అరెస్టు చేయడంతో నేడు జనార్థన్ రావును న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశముంది.


Similar News