ఏపీని భయపెడుతున్న మండూస్

దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2022-12-07 02:36 GMT

దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. నినన రాత్రికి ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1,020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం మండూస్ తుపానుగా బలపడి రేపు ఉదయానికి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరానికి సమీపంలో చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాలు...
మండూస్ తుపాను ఈ నెల 9న తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశముందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో 8,9,10 తేదీలలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ ఐదు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. మత్స్యకారులు ఈ నెల 10 వరకూ చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది.


Tags:    

Similar News