శ్రీవారికి 121 కిలోల బంగారం
ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి 121 కిలోల బంగారాన్ని విరాళం
ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తుడు ఓ కంపెనీ స్థాపించి విజయవంతమయ్యారు. అందులో 60 శాతం వాటా అమ్మితే ఆయనకు సుమారు 6 నుండి 7 వేల కోట్ల రూపాయల డబ్బులు వచ్చింది. ఈ సంపద అంతా స్వామివారు ఇచ్చిందేనన్న ఆలోచనతో తిరుమలేశుడికి 121 కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకొచ్చారని సీఎం వివరించారు. శ్రీవారు నిత్యం 120 కిలోల ఆభరణాలు ధరిస్తారు. ఈ భక్తుడు కూడా సుమారు అంతే స్వర్ణాన్ని కానుకగా సమర్పించేందుకు ముందుకొచ్చారు. దీని విలువ 140 కోట్ల రూపాయల పైనేనని అంచనా వేస్తున్నారు.