Nara Lokesh : బొత్సకు పార్టీపై పట్టు లేదు : లోకేశ్

శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ నేతలపై పట్టుకోల్పోయారని మంత్రి నారా లోకేశ్ అన్నారు

Update: 2026-02-18 06:26 GMT

శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ నేతలపై పట్టుకోల్పోయారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు వేరు వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారన్నారు. ఒకరు లడ్డూ కల్తీపై చర్చ కోరారని, మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చ అడిగారని మంత్రి లోకేశ్ తెలిపారు.

కొలొంబో పర్యటనపై...
ఏ అంశంపై చర్చించాలన్న దానిపై వైసీపీ సభ్యులకే క్లారిటీ లేదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. మరొకవైపు తాను భారత్ - పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ చూసేందుకు కొలొంబో వెళ్లేందుకు ప్రభుత్వ నిధులను ఉపయోగించలేదని తెలిపారు. సొంత ఖర్చులతోనే విమాన టిక్కెట్లు కొన్నానని, కావాలని ఒక వర్గం మీడియా తన కొలొంబో పర్యటనపై దుష్ప్రచారం చేస్తుందని అన్నారు.


Tags:    

Similar News