Srikakulam :విషాదానికి కారణం అదే.. ఇంత మంది మరణానికి దారి తీసిన పరిస్థితులవేనట

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మరణించారు

Update: 2025-11-01 07:25 GMT

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన విషాదం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. . కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శనివారం, కార్తీమాసం, ఏకాదశి కావడంతో ఈరోజు వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని అందరూ భావిస్తారు. అయితే ఈ ఆలయం దేవాదాయ శాఖకు సంబంధించింది కూడా కాదని తెలిసింది. ఆ ప్రాంతంలోని పాండా కుటుంబం పన్నెండు ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించింది. ఎప్పుడూ ఈ ఆలయానికి ఇంత రద్దీ ఉండేది కాకపోవడం, అంత ప్రాముఖ్యత లేకపోవడంతో అక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించనుంది.

పదేళ్ల క్రితం నిర్మించిన...
పదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ ఆలయ నిర్మాణం ఏడాదిన్నర క్రితం పూర్తయిందంటున్నారు. కాశీబుగ్గ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పాటు అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈఘటనలో అనేక మంది గాయపడ్డారు. కార్తీక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. రెయిలింగ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటతో తొమ్మిది మంది మరణించారని తెలిసింది. మృతుల్లో ఎక్కువమంది మహిళలున్నారని సమాచారం. ఆలయంలోకి వచ్చే మార్గం, వెళ్లే మార్గం ఒక్కటే కావడంతో ఈ దుర్ఘటన జరిగింది. అక్కడ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు తగిన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. అనేక మంది గాయపడ్డారు.
సామర్థ్యానికి మించి రావడంతో..
ఒక్కసారిగా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగి మరణించారని తెలిసింది. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పదేళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి కేవలం రెండు వేల మందికి మాత్రమే సామర్థ్యం ఉంది. అయితే ఈరోజు ఇరవై వేల మంది భక్తులు వచ్చారని తెలిసింది. ఆలయానికి చెందిన వారు ముందుగా పోలీసులకు సమాచారం తెలియజెప్పకపోవడం కూడా ఈ తొక్కిసలాటకు కారణం. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రీకాకుళం ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ప్రమాద ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వరసగా తిరుపతి, సింహాచలం తొక్కిసలాట జరిగి భక్తులు మరణించినా పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.








Tags:    

Similar News