Weather Report : దీని దుంపతెగ.. చలి ఇంతలా చంపేస్తుందని అనుకోలేదే?
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశముంది
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు శ్రీలంకలో విస్తారంగా వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం తీరం దాటే సమయంలో తమిళనాడును ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వానలు పడతాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని చెప్పింది. వాయుగుండం ప్రభావంతో చలిగాలుల తీవ్ర పెరుుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.
కొన్ని చోట్ల వానలు...
ఆంధ్రప్రదేశ్ లో పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఏపీలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. పొగమంచు ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. సంక్రాంతికి సొంతూళ్లకు సొంత వాహనాల్లో వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు...
తెలంగాణలో గత మూడు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనేక చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గత మూడు రోజుల నుంచి చలితీవ్రత పెరగడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉదయం తొమ్మిది గంటల వరకూ, సాయంత్రం ఐదు గంటల తర్వాత బయటకు రావడం లేదు.విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పడిపోయింది. ఫ్యాన్ వేసుకుంటే గజగజ వణికిపోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమ్రభీం ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్ప డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.