Chandrababu : నేడు అమరావతికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి చేరుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి చేరుకోనున్నారు. లండన్ పర్యటనకు ఈ నెల 2వ తేదీన బయలుదేరి వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖలో జరిగే పార్ట్ నర్ షిప్ సమ్మిట్ కు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలతో సమావేశమై కోరారు. దీంతో పాటు సతీమణి భువనేశ్వరి అవార్డు తీసుకునే కార్కక్రమంలోనూ చంద్రబాబు పాల్గొన్నారు.
మంత్రులతో సమావేశం...
నాలుగు రోజుల లండన్ పర్యటన ముగించుకుని నేడు చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి వెంటనే బయలుదేరి అమరావతికి చేరుకుంటారు. తర్వాత సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం సచివాలయంలో మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. వివిధ అంశాలపై ఆయన మంత్రులతో నేడు చర్చించనున్నారు.