Chandrababu : తొక్కిసలాటపై చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయానికి అంత మంది భక్తులు వస్తారని తెలిసి ఎందుకు బందోబస్తు ఏర్పాటు చేయలేదని చంద్రబాబు పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మెరుగైన చికిత్స కోసం...
పది మంది వరకూ మరణించడం దురదృష్టకరమని అన్నారు. ఆలయంలో జరిగిన దుర్ఘటనకు గల కారణాలపై నివేదిక అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. గాయపడిన వారందరినీ అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు సూచించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.