Andhra Pradesh : మార్చి 6 వరకూ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిసింది

Update: 2026-02-11 06:58 GMT

ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిసింది. మార్చి 6వ తేదీ వరకూ సభను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీన శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మొత్తం పదహారు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పదహారు రోజుల పనిదినాలు ఉండేలా సమావేశాల నిర్వహణ ఉండనుంది.

పదహారు రోజులు..
మార్చి 5,6,7 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలను నిర్వహించాలని కూడా నిర్ణయించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ లాబీలో స్పీకర్ మీడియాతో సరదా వ్యాఖ్యలు చేశారు. 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా... అంతకు మించి ఎక్కువ సమయం లేరుగా ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.


Tags:    

Similar News