Amaravathi : అమరావతికి రాజముద్ర
అమరావతికి చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ఆమోదం లభించింది
అమరావతికి చట్టబద్ధత లభించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించిన తర్వాత నిన్న రాత్రి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా లభించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం బిల్లు నిన్న ఉదయం రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. న్యాయనిపుణులతో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోద ముద్రను వేశారు.
పది గంటలకు గెజిట్ నోటిఫికేషన్...
రాత్రి పది గంటలకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్ధత లభించినట్లయింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి కొత్త రాజధానిగా అమరావతి ఉంటుందని అని గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 2024 జూన్ 2వ తేదీ నుంచి రాజధాని అమరావతి అమలులోకి వచ్చింది. దీంతో పూర్తి స్థాయి చట్టబద్ధత అమరావతి రాజధానికి లభించినట్లయింది.