Andhra Pradesh : నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది.

Update: 2026-03-13 02:51 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఆర్డీఏ ఆమోదించిన తీర్మానాలకు సంబంధించి చర్చించి మంత్రి వర్గ సమావేశంలో నేడు ఆమోదించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపుల విషయంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

గ్యాస్ కొరతపై...
ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో దేశంలో ఇంధన కొరతపై కూడా చర్చించనున్నారు. ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతపై ఇప్పటికే ఏపీలోని హోటల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో నేటి కేబినెట్ సమావేశంలో గ్యాస్ కొరతపై చర్చించనున్నారు. గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కూడా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలపై మంత్రి వర్గ సమావేశం చర్చించనుంది.


Tags:    

Similar News