Andhra Pradesh : కేబినెట్ కు ఆరుగురు మంత్రుల డుమ్మా

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మంత్రి వర్గ సమావేశానికి ఆరుగురు మంత్రులు గైర్హాజరయ్యారు.

Update: 2026-03-13 08:05 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మంత్రి వర్గ సమావేశానికి ఆరుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న పలువురు మంత్రులు అనారోగ్యానికి గురయ్యారు. ఈరోజు మంత్రివర్గ సమావేశానికి ఆరుగురు మంత్రులు హాజరు కాలేదు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న పలువురు మంత్రులకు అనారోగ్యం తలెత్తడంతో నేటి మంత్రి వర్గ సమాేశానికి దూరంగా ఉన్నారు.

అనారోగ్య కారణాలతో కొందరు...
మంత్రి గొట్టిపాటి రవికుమార్, వంగలపూడి అనిత, టీజీ భరత్ లు అనారోగ్యంతో రాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారు. జనసేన ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లలో బిజీగా ఉండటంతో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కూడా హాజరు కాలేదు. భార్య సంవత్సరీకం కారణంగా రాలేకపోతున్నట్లు సఎన్.ఎం.డి.ఫరూక్ సమాచారం ఇచ్చారు.


Tags:    

Similar News