Andhra Pradesh : నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. మూడేళ్లలో దశలవారీగా 10 వేల పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్య, ఇంటర్ లో 3 వేల పోస్టులు భర్తీ చేయనుంది.
పది వేల పోస్టులు...
ఎస్ఐ, కానిస్టేబుళ్లు మూడు వేల పోస్టులు భర్తీ చేయనుంది. యూనివర్సిటీ సహాయ ఆచార్యులు 1500 పోస్టులు భర్తీ చేయనుంది. ఏఈలు 500, హాస్టల్ వార్డెన్లు 200 పోస్టులు, స్టాటిస్టిక్స్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందలు, గ్రూప్-1- 100, గ్రూప్-2- 500 పోస్టులు భర్తీ చేయనుంది. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా ప్రణాళికను ఏపీ ప్రభుత్వం రూపొందించింది.