Chandrababu : పవన్ కల్యాణ్ శాఖపై చంద్రబాబు అసంతృప్తి
రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు
రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. అటవీ శాఖ అధికారులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలంటూ ముఖ్యమంత్రి సూచించారు. పోలీస్ పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారు కానీ... ఫారెస్ట్ మారలేకపోతోందంటూ సీఎం కామెంట్ చేశారు. అటవీ శాఖ అధికారుల తీరు వల్ల ఇటీవల కాలంలో ఏర్పడ్డ ఇబ్బందులను సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. హిందూపూర్ వద్ద ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామని వెల్లడించారు. అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు అటవీ శాఖ సహకరించాలని కోరారు. నాలుగోసారి సీఎంగా చేస్తున్నానని, కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడానని, మళ్లీ మరోసారి మాట్లడతానని చెప్పారు. పోలీసు డిపార్ట్మెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా మారింది కానీ ఫారెస్టు డిపార్టుమెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా లేరని చెప్పారు.