Andhra Pradesh : గుడ్ న్యూస్...ఉగాదికి జాబ్ క్యాలెండర్, పది వేల ప్రభుత్వ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మొత్తం 10,000 పోస్టులు మూడు సంవత్సరాల్లో దశలవారీగా భర్తీ చేయాలని ప్రణాళిక రూపొందించారు.
ప్రతిపాదిత పోస్టులు:
పాఠశాల విద్య & ఇంటర్ – 3,000
SI & కానిస్టేబుళ్లు – 3,000
విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు – 1,500
AE పోస్టులు – 500
సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు – 200
అటవీశాఖ – 100
స్టాటిస్టిక్స్ అధికారులు – 200
గ్రూప్-1 – 100
గ్రూప్-2 – 500
మూడు సంవత్సరాల్లో దశలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయిచింది. దీంతో యువతకు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.