Chandrababu : గ్యాస్ సరఫరా పై చంద్రబాబు కీలక ప్రకటన

మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు

Update: 2026-03-14 12:14 GMT

అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు వారికి కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితిని సీఎం చంద్రబాబుకు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.

కేంద్రంతో సమన్వయం చేసుకుని...
కేంద్రంతో సమన్వయం చేసుకుని గ్యాస్ కొరత లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మరో ఐదు రోజుల వరకూ గ్యాస్ సమస్య ఉండదని, గృహ వినియోగదారులకు అందించగలుగుతామని మంత్రులు చంద్రబాబుకు వివరించారు. తర్వాత పరిస్థితిపై కొంత చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఆందోళనకు గురిచేసే వారిపై కఠిన చర్యలపై చర్చించారు.


Tags:    

Similar News