Andhra Pradesh : ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నేడు ప్రమాణస్వీకారం చేశారు

Update: 2026-03-13 05:32 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నేడు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు లోని మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ జస్టిస్ లీసాగిల్ ఉదయం 10.15 నిమిషాలకు ప్రమాణం చేశారు. పంజాబ్-హరియాణా ఉమ్మడి హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్ లీసాగిల్ ఇక్కడ రెండోస్థానంలో కొనసాగుతారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం విషయంలో ముఖ్యమైన విధానపరమైన నిర్ణయం తీసు కుంది.

వచ్చే నెల 24 తర్వాత బాధ్యతలు...
న్యాయ పరిపాలనలో సామర్థ్యాన్ని, నాణ్యతను మరింత బలో పేతం చేయడానికి చీఫ్ జస్టిస్ కాబోయే న్యాయమూర్తిని ఆ పదవికి ఖాళీ ఏర్పడడానికి రెండు నెలల ముందే సంబంధిత కోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పంజాబ్-హరియాణా ఉమ్మడి హైకోర్టులో మూడోస్థానంలో ఉన్న జస్టిస్ లీసాగిల్ ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. కాగా, ఏపీ హైకోర్టులో 37మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉండగా ప్రస్తుతం జస్టిస్ లీసాగిల్ చేరికతో ఈ సంఖ్య 34కి చేరనుంది. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనుండగా, ఆ వెంటనే సీజేగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. ఈ నియామకం ద్వారా ఏపీ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్రకెక్కనున్నారు.


Tags:    

Similar News