Nara Lokesh : నారా లోకేశ్ వార్నింగ్ విన్నారా?

మంత్రి నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు

Update: 2026-01-07 07:17 GMT

మంత్రి నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ యాక్ట్ 2000 – సేఫ్ హార్బర్, బ్లాకింగ్ పవర్స్, ఐటీ రూల్స్ 2021 – కంప్లయన్స్ అండ్ ట్రేసబిలిటీ, డిపీడీపీ యాక్ట్- 2023 డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్, జ్యుడీషియల్ సేఫ్ గార్డ్స్ – ఫ్రెష్ స్పీచ్ & ప్రైవసీ లపై చర్చించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తామని, ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలను సహించబోమని తెలిపారరు.

సోషల్ మీడియాలో....
గతంలో జ్యుడీషియరీతో పాటు కొంతమందిని టార్గెట్ చేసి అసభ్య పోస్టులు పెట్టారని, విదేశాల్లో ఉండి అభ్యంతర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేస్తామన్న లోకేశ్ ఇందుకోసం బలమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు పోస్టుల కట్టడికి కేంద్రప్రభుత్వం సహయోగ్ ఇంటిగ్రేషన్ పోర్టల్ ప్రవేశపెట్టిందని, మాజీ ముఖ్యమంత్రి భార్యపై పోస్టు చేస్తే తమ పార్టీ వాడైనా జైలుకు పంపించామని లోకేశ్ గుర్తు చేశారు. వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతమైన వ్యాఖ్యలు, ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.


Tags:    

Similar News