Amaravathi : ప్లాన్ మార్చిన సర్కార్... ల్యాండ్ పూలింగ్ లో కొత్త పంథా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిలో రెండో దశ భూసమీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది

Update: 2026-01-07 04:11 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిలో రెండో దశ భూసమీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండో దశలో 20,494 ఎకరాలకును రైతుల నుంచి సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రెండోదశ ల్యాండ్ పూలింగుకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే భూ సమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో నేటి నుంచే రెండో దశ భూ సమీకరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం ప్లాన్ మార్చినట్లు కనపడుతుంది. ఇకపై ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

అసంతృప్తి తలెత్తుందని...
సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఒక్కసారి వేల ఎకరాల భూములను తీసుకుంటే ప్రభుత్వంపై విమర్శలతో పాటు అసంతృప్తి తలెత్తుతుందని భావించి ఏ ప్రాజెక్టుకు... సంబంధించి ఆ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సమీకరించాలన్నఉద్దేశ్యంతో ఉంది. రెండో దశలో మాత్రం 20,494 ఎకరాలను భూమిని సేకరించి, ఇకపై ఏ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని అప్పటికప్పుడు భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని, అందువల్ల అసంతృప్తి కూడా పెద్దగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ప్రభుత్వం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ రాజధాని నిర్మాణం జరగాలంటే ఇంకా భూమి అవసరమవుతుందని భావిస్తున్నారు.
ఏడు గ్రామాల్లో...
మొదటి దశలో సమీకరించిన భూమి కేటాయింపులు జరగడంతో ఇప్పుడ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్, అంతర్జాతీయ విమానాశ్రయాలకు భూ సమీకరణ చేయాల్సి వచ్చిందంటున్నారు. రెండు విడత భూ సమీకరణలో లో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి, గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో ఏడు గ్రామాల నుండి భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబరు 27 జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఏడు గ్రామాల్లో భూ సమీకరణ అధికారాన్నిసీఆర్డీఏ కమిషనర్ కు ప్రభుత్వం అప్పగించింది. తాజా నోటిషికేషన్ ద్వారా 16,562.56 ఎకరాల పట్టా భూమి, 104.01 ఎకరాలు అసైండ్ భూమి మొత్తం 16,666.57 ఎకరాలు ప్రభుత్వ భూమి 3828.56 ఎకరాలు తీసుకోనున్నారు. తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి లేమల్లెలో భూసమీకరణ చేయనున్నారు.


Tags:    

Similar News