Amaravathi : నేటి నుంచి రెండో విడతభూ సమీకరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు రెండో విడత భూ సమీకరణ ప్రారంభం కానుంది
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నేడు రెండో విడత భూ సమీకరణ ప్రారంభం కానుంది. తొలుత వడ్లమాను, యండ్రాయి గ్రామాల్లో మొదటి రోజు సమీకరణ చేయనున్నారు. ఈ రెండు గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం రెండో విడతలో అమరావతి ప్రాంతంలో దాదాపు ఇరవై వేల ఎకరానలను రైతుల నుంచి సమీకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
రెండు గ్రామాల్లో...
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయింది. అయితే ఈ రోజు మంచి రోజు కావడంతో నేటి నుంచి భూసమీకరణను మొదలుపెట్టాలని నిర్ణయించారు. గ్రామసభల్లో మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో పాటు సీఆర్డీఏ అధికారులు హాజరయి రైతులకు ఏ రకమైన ప్రయోజనాలు అందుతాయో వివరించనున్నారు.