Andhra Pradesh : త్వరలోనే ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది

Update: 2026-01-06 03:47 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ లో చర్చ జరిగింది.ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్‌లు, 9 & 10 షెడ్యూల్లోని సంస్థల ఉద్యోగులకు వయో పరిమితి పెంపుపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చ జరిగింది. కోర్టు ఆదేశాలతో 62 ఏళ్ల వయో పరిమితితో ఉద్యోగులు విధుల్లో కొనసాగుతున్నారు.

వయో పరిమితి పెంపుతో...
వయో పరిమితి పెంపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై చర్చించారు. కార్పొరేషన్ల వారీగా ఉద్యోగులు, ఆర్థిక భారం వివరాలతో మరోసారి సమావేశం కావాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నారు. అయితే కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వయో పరిమితి పెంపుదలపై త్వరలోనే మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక సమర్పించనుంది.


Tags:    

Similar News