Amaravathi : రాజధాని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
అమరావతిలో భూములిచ్చే రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు
అమరావతిలో భూములిచ్చే రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. రాజధాని లో రెండో విడత భూ సమీకరణకు సహకరించే రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నేడు రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైన సందర్బంగా వడ్డమాను గ్రామంలో కార్యాలయాన్ని ప్రారంభించిన నారాయణ రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
రుణమాఫీ చేస్తామని...
గతంలోనూ రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఇప్పుడు కూడా రుణ మాఫీ చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ అడిగిన వెంటనే ఈ విషయమై తాను చంద్రబాబు నాయుడు తో మట్లాడానని అందుకు ఆయన అంగీకరించారని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ నె 6 వ తేదీ నాటికి తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నామని మంత్రి నారాయణ తెలిపారు