Amaravathi : రాజధాని భూ సమీకరణలో గందరగోళం
అమరావతి రాజధాని భూ సమీకరణలో గందరగోళం ఏర్పడింది
అమరావతి రాజధాని భూ సమీకరణలో గందరగోళం ఏర్పడింది. వడ్డమాను గ్రామంలో రైతులు మంత్రి నారాయణను నిలదీశారు. తొలి విడత చేపట్టిన భూ సమీకరణకు సంబంధించి అభివృద్ధి ఎంత వరకూ జరిగిందని రైతులు ప్రశ్నించారు. మొదటి విడత అభివృద్ధి చేయకుండానే రెండో విడత భూ సమీకరణ చేస్తే ఎలా అని కొందరు రైతులు మంత్రి నారాయణను, ఎమ్మెల్యే శ్రావణకుమార్ ను నిలదీశారు. వడ్డమాను లో ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి కార్యాలయాన్ని ప్రారంభించారు.
చట్ట బద్ధత ఏదంటూ...
అమరావతిలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందని రైతులు ప్రశ్నించారు. మూడేళ్లలో తాము అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలిపారు. అయితే దీనికి చట్టబద్ధత ఏదని ప్రశ్నించారు. తమకు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని రైతులు కోరారు. అయితే కొందరు మాత్రం భూ సమీకరణకు అడ్డం తిరగగా మరికొందరు రైతులు స్వచ్ఛందంగా భూములను సమీకరణలో భాగంగా ఇచ్చారు.