Andhra Pradesh : నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది

Update: 2026-01-08 02:48 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలుతీసుకోనున్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని లో భూ కేటాయింపులతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల వివిధ సంస్థలకు భూమి కేటాయింపుపై చర్చించి ఆమోదించనున్నారు. సీఆర్డీఏ అధారిటీలో ఆమోదించిన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కృష్ణానదీ తీరంలో వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయిపుపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

భూ కేటాయింపులతో...
రాజధాని అమరావతిలో గతంలో కేటాయించిన 112 ప్లాట్లలో మార్పులకు సయితం కేబినెట్ ఆమోదం చెప్పనుంది. ఎస్ఐపీబీలో ఆమోదించిన పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపేఅవకాశముది. మొత్తం పథ్నాలుగు సంస్థలకు 19,391 కోటట్ల పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలపనుంది. అనంతరం కృష్ణా జలాల వివాదంపై కూడా కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు పలు రాజకీయ అంశాలకు సంబంధించి చర్చించనున్నారు.


Tags:    

Similar News