రిపబ్లిక్ డే వేడుకలకు అమరావతి సిద్ధం
రిపబ్లిక్ డే వేడుకలకు అమరావతి సిద్ధమయింది.
రిపబ్లిక్ డే వేడుకలకు అమరావతి సిద్ధమయింది. ఎప్పుడూ విజయవాడ ఇందిరగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించే వారు. తొలిసారిగా నవ్యాంధ్ర రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు రేపు జరగనున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డులో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు పూర్తయింది. రిపబ్లిక్ డే వేడుకలకు 22 ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 13 వేలమంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
తొలిసారి అమరావతిలో...
అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీల ఏర్పాటు చేసిన అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఫైనల్ రిహార్సల్స్ కూడా ప్రదర్శించారు. గణతంత్ర వేడుకలు తొలిసారిగా అమరావతిలో నిర్వహించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు గత కొద్ది రోజుల నుంచి శ్రమించి ఏర్పాట్లు పూర్తి చేశారు.