పొగాకుకు రాని గిట్టుబాటు ధర.. ఆందోళనలో రైతులు

ఆంధ్రప్రదేశ్‌లో వర్జీనియా పొగాకు రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Update: 2026-04-07 06:43 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వర్జీనియా పొగాకు రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు కొనుగోలు కేంద్రాల్లో ధరలు తగ్గడంతో ధరల్లేక వర్జీనియా పొగాకు రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రికార్డు ధర రూ.411 నుండి రూ.265కి పడిపోవడం రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది.

నైరాశ్యంలో పొగాకు రైతు...
వర్జీనియా పొగాకు మార్కెట్ కదలక పోవడంతో తీవ్ర నైరాశ్యంలో రైతాంగం మునిగిపోయింది. ఈరోజు మార్కెట్ లో గరిష్ట ధర కేజీ రూ. 265,కనిష్ట ధర రూ. 250లు ఉంది. ఇదే రీతిన మార్కెట్ ధోరణి కొనసాగితే తమ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరం అంటూ చిన్నా, సన్నకారు రైతాంగం కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.


Tags:    

Similar News