గాజువాకలో మంత్రి నారాయణ
విశాఖలోని గాజువాకలో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు
విశాఖలోని గాజువాకలో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి పలు అభివృద్ది పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. గాజువాక జోన్ గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ ను పరిశీలించిన మంత్రి నారాయణ, 76వ వార్డు హెచ్ బీ కాలనీలో అల్లూరి సీతారామరాజు పార్కును ప్రారంభిచారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నగరంలో డంపింగ్ యార్డు అవసరం లేకుండా ఎప్పటికప్పుడు చెత్తను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలిస్తున్నామని చెప్పారు. *గాజువాకలో 4.75 ఎకరాల్లో అన్ని రకాల వసతులతో పార్కును ప్రారంభించామని గత ప్రభుత్వం మున్సిపల్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, మునిసిపాలిటీల్లో ప్రజలు కట్టిన పన్నులు ఇతర అవసరాలకు మళ్లించేసిందని నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం పక్కదారి పట్టించిన 1700 కోట్లు నిధులు ఇంకా మునిసిపాలిటీలకు రాలేదన్నారు.