వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్
విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. యాజమాన్య వైఖరికి నిరసనగా సమ్మకు దిగాలని నిర్ణయించాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. యాజమాన్య వైఖరికి నిరసనగా సమ్మకు దిగాలని నిర్ణయించాయి. ఈ మేరకు సమ్మె నోటీసులు కార్మికసంఘాలు యాజమాన్యానికి ఇచ్చాయి. మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించి, యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడంతో యాజమాన్యం కార్మిక సంఘాల నేతలతో చర్చించే అవకాశముంది.
ఇవీ కారణాలు...
విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి పరిణామాలతో కార్మికులు సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,400 కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది. వీఆర్ఎస్ కోసం ఐదువందల కోట్ల రూపాయలు విడుదలచేసింది. అయితే త మ ప్రధాన డిమాండ్లను నెరవేర్చడం లేదన్నది కార్మిక సంఘాల ఆరోపణ