నేటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె
విశాఖ స్టీల్ ప్లాంట్ కాంటాక్ట్ కార్మికులు నేటి నుంచి సమ్మెకు దిగనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కాంటాక్ట్ కార్మికులు నేటి నుంచి సమ్మెకు దిగనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంటాక్ట్ కార్మికులను తొలగించడాన్ని తప్పుపడుతూ ఈ సమ్మెకు దిగనున్నారు. వారికి సంఘీభావంగా రెగ్యులర్ కార్మికులు ఒకరోజు విధులను బహిష్కరించనున్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ...
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, నిధులు ఇచ్చినా అరకొరగా ఇవ్వడమే కాకుండా కార్మికుల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేశాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్మికుల సమ్మె నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లోపల బంద్, ర్యాలీలపై యాజమాన్యం నిషేధం విధించింది. పోలీసులు భారీగా మొహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.