Heavy Rains : సిక్కోలులో అతి భారీ వర్షాలు.. హై అలెర్ట్
శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటించారు.నాగావళి నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులకు మంత్రుల సూచనలు చేశారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు...
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ ఎవరూ వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‍లో కంట్రోల్ రూమ్ 08942-240557 ఏర్పాటు చేశారు.