Visakhapatnam : విశాఖను ఆపడం ఇక ఎవరి తరమూ కాదా?
శరవేగంగా అభివృద్ధి చెందే నగరాల్లో విశాఖనగరం ఒకటి. కాస్మోపాలిటన్ సంస్కృతితో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివాసముంటున్నారు.
శరవేగంగా అభివృద్ధి చెందే నగరాల్లో విశాఖనగరం ఒకటి. కాస్మోపాలిటన్ సంస్కృతితో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివాసముంటున్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఎలానో.. ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నం అలాంటిదని చెప్పాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు పోర్టు, హెచ్.పి.సీ.ఎల్. బి.హెచ్.పి.వి. నేవీ వంటి సంస్థలు ఉండటంతో దేశంలో అన్ని సంస్కృతులు, సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. అచ్చం హైదరాబాద్ తరహాలోనే విశాఖకు ఎక్కినుంచో వచ్చి ఇక్కడ సెటిలయ్యారు. సముద్రం ఒడ్డున ఉన్న నగరం కావడంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు హెల్త్ పరంగా కూడా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండటంతో రోజురోజుకూ విశాఖపట్నం రూపు రేఖలు మారిపోతున్నాయి.
ఎప్పటి నుంచో జరుగుతున్న...
ఇక విశాఖపట్నాన్ని ఐటీకి కేంద్రంగా తయారు చేయాలని ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఊపందుకున్నాయి. ప్రతిష్టాత్మకమైన కంపెనీలకు భూమిని తక్కువ ధరకు ప్రభుత్వం కేటాయిస్తుండటంతో కంపెనీలు కూడా విశాఖకు చేరుకుంటున్నాయి. కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలకు భూముల కేటాయింపు జరిగింది. టీసీఎస్ ఐటీ డెలవప్‌మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే మిలీనియం టవర్స్ లో తాత్కాలికంగా ఆఫీస్ ప్రారంభించడానికి సన్నాహాలను చేస్తుంది. త్వరలోనే శాశ్వత నిర్మాణాలను ప్రారంభించబోతోంది. కాగ్నిజెంట్ విశాఖలో భారీ క్యాంపస్ పెడుతున్నట్లుగా ప్రకటించింది. ఈ ఏడాదే కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అనేక ప్రముఖ కంపెనీల రాకతో...
టీసీఎస్ తర్వాత రెండో అతి పపెద్ద ప్రాజెక్టు ఏఎన్ఎస్సార్ జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్, మధురవాడలో నిర్మించనుంది. అమెరికాలో భారతీయులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో భారత్ కు వచ్చేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఇక సాఫ్ట్ వేర్ కంపెనీలు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడే ఆఫీసులు తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో విశాఖ చాలా కంపెనీలకు ఇండియాలో బెస్ట్ ఆప్షన్ అవుతుందన్న అంచనాలు వినపడుతు్నాయి. రానున్న పదేళ్ల కాలంలో లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు విశాఖకు వచ్చే అవకాశముందని అంటున్నారు. ప్రభుత్వం కూడా విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం జరగడం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుండటంతో విశాఖ అతివేగంగా డెవలెప్ అవుతుందని అంటున్నారు. ఐటీ రంగంలో విశాఖ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల సరసన చేరడానికి ఎంతో సమయం పట్టదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.