ఫుల్లు అయిని విశాఖ ఎయిర్ పోర్టు

విశాఖ విమానాశ్రయం ప్రత్యేక విమానాలతో నిండిపోయింది.

Update: 2025-11-15 02:12 GMT

విశాఖ విమానాశ్రయం ప్రత్యేక విమానాలతో నిండిపోయింది. దేశం నలుమూల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి ప్రత్యేక విమానాల్లో విశాఖలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులు విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సుకు చేరుకున్నారు. దీంతో విశాఖ ఎయిర్ పోర్ట్ మొత్తం పార్కింగ్ బేస్ లోవిమానాలతో నిండిపోయాయి. మొత్తం పదహారు బేస్ లుండగా అందులో 1 నుంచి 10 బేస్ లలో షెడ్యూల్ కమర్షియల్స్ ఫ్లైట్స్ పార్క్ అవుతాయి.

భాగస్వామ్య సదస్సుకు వచ్చి...
మిగిలిన 6 బేస్ లో ఆరు ఫ్లైట్స్ కి మాత్రమే పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. కానీ ఈ రోజు విశాఖ వచ్చిన ప్రత్యేక విమానాలు పన్నెండు ఉన్నాయి. విశాఖ ఎయిర్ పోర్ట్ లో పార్కింగ్ లేకపోవడంతో రాజమండ్రి విమానాశ్రయంలో పార్క్ అయిన ఆరు ప్రత్యేక విమానాలను పార్క్ చేయాల్సి వచ్చింది. విమానాలు ఇంత పెద్ద సంఖ్యలో రావడంతో ప్రయాణికులు వెళ్లే విమానాలకు ఇబ్బందులు కలడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News