నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర మంత్రులు

నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస వర్మలు సందర్శించనున్నారు

Update: 2025-01-30 04:31 GMT

నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర మంత్రులు సందర్శించనున్నారు. కేంద్ర మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస వర్మలు విశాఖ ప్లాంట్ ను సందర్శించి అక్కడ అధికారులతో చర్చించనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,400 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

బొగ్గు గనులు కేటాయించాలని...
అయితే ఇప్పటికే 35 వేల కోట్ల అప్పుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడానికి అవసరమైన చర్యలపై కేంద్ర మంత్రులు చర్చించనున్నారు. ప్రత్యేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు గనులను కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News