సింహాచలం గిరిప్రదిక్షణలో భారీగా పాల్గొన భక్తులు
సింహాచలం గిరిప్రదిక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు
సింహాచలం గిరిప్రదిక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో విశాఖపట్నం భక్తజన సంద్రంగా మారిపోయింది. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే గిరి ప్రదిక్షణ కోసం భక్తులు చేరుకున్నారు. తొలి పావంచావద్ద అప్పన్నస్వామికి కొబ్బరి కాయ కొట్టి 32 కిలోమీటర్ల మేరకు గిరి ప్రదిక్షిణకు బయలుదేరారు.
భద్రత ఏర్పాట్లను...
మధ్యాహ్నం రెండు గంటలకు అధికారికంగా సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో తొలి పావంచా నుంచిస్వామి వారి పుష్పరథం వరకూ గిరి ప్రదిక్షణ బయలుదేరుతున్నప్పటికీ ముందుగానే భక్తులు ప్రదిక్షిణలను ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడు వేల మంది పోలీసులను భద్రత కోసం నియమించారు. రేపు సాయంత్రం వరకూ ఈ గిరి ప్రదిక్షిణ కొనసాగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.