వాల్తేరు కేంద్రీయ విద్యాలయ పాఠశాల ప్రిన్సిపల్‌ సీబీఐ కేసు

విశాఖపట్నంలోని వాల్తేరు కేంద్రీయ విద్యాలయ పాఠశాల ప్రిన్సిపల్‌పై కేంద్ర దర్యాప్తు

Update: 2023-09-21 16:43 GMT

విశాఖపట్నంలోని వాల్తేరు కేంద్రీయ విద్యాలయ పాఠశాల ప్రిన్సిపల్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. నకిలీ ధ్రువపత్రాలతో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించినందుకు ఈ అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. వాల్తేరులోని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస రాజా అనే వ్యక్తి గత రెండేళ్లలో విద్యార్థులకు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా అడ్మిషన్లు కల్పించినట్లు తెలుస్తోంది. ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నగదు తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. వివిధ కేంద్ర విద్యాసంస్థల పేరుతో నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి 193 మంది విద్యార్థులకు వాల్తేరు కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో అక్రమంగా అడ్మిషన్లు ఇచ్చినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

2023 సంవత్సరం మే 3, 4 తేదీల్లో సీబీఐ అధికారులు వాల్తేరు కేంద్రీయ విద్యాలయ స్కూల్ లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రిన్సిపల్‌ శ్రీనివాస రాజా ఫేక్ సర్టిఫికేట్లతో అర్హతలేని విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించినట్లు గుర్తించారు. ప్రిన్సిపల్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన సీబీఐ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకున్నట్లు గుర్తించారు. 2022-23లో 69 మంది విద్యార్థులకు, 2021-22లో 124 మొత్తం 193 మందికి నకిలీ ధ్రువపత్రాలతో పాఠశాలలో ప్రవేశాలు కల్పించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.


Tags:    

Similar News