విశాఖలో జనసేకు ఝలక్ ఇచ్చిన టీడీపీ
విశాఖ డిప్యూటీ మేయర్ పదవి విషయంలో జనసేనకు టీడీపీ షాక్ ఇచ్చింది
విశాఖ డిప్యూటీ మేయర్ పదవి విషయంలో జనసేనకు టీడీపీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు సీల్డ్ కవర్ లో పార్టీ నాయకత్వం పేరును కూడా పంపింది. జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును ఖరారు చేసింది. మేయర్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపిక కావడంతో డిప్యూటీ మేయర్ పదవిని తమకు ఇవ్వాలని జనసేన పార్టీ పట్టుబట్టింది. దీంతో టీడీపీ నాయకత్వంకూడా అందుకు అంగీకరించింది.
జనసేనకు ఇవ్వడంతో...
అయితే జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వడంతో టీడీపీ కార్పొరేటర్లు అలిగి సమావేశానికి హాజరు కాలేదు. టీడీపీ కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. బీజేపీ, జనసేన కార్యకర్తలు మాత్రమే హాజరు కావడంతో కోరం లేక సమాశాన్ని అధికారులు వాయిదా వేశారు.