Andhra Pradesh : దీపావళికి రైల్వే శాఖ గుడ్ న్యూస్

దీపావళి పండగ కోసం వెళ్లేవారి కోసం రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-10-03 01:59 GMT

దీపావళి పండగ కోసం వెళ్లేవారి కోసం రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండగకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లన నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెలలో దీపావళి పండగ ఉండటంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపింది. విశాఖపట్నం నుంచి దానాపూర్, దానాపూర్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు చెప్పింది. అలాగే విశాఖపట్నం నుంచి భువనేశ్వర్, భువనేశ్వర్ నుంచి విశాఖల మధ్య కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే శాఖ ప్రకటించింది.

వచ్చే నెల నాలుగోతేదీన...
నవంబరు నెల 4వ తేదీన ఉదయం 9.10 గంటలకు దానాపూర్ కు బయలుదేరనున్న ఎక్స్ ప్రెస్ రైలు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. ఐదో తేదీన ఉదయం పదకొండు గంటలకు దానాపూర్ కు చేరుకుంటుంది. తిరిగి దానాపూర్ నుంచి నవంబరు ఐదో తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరిన ఎక్స్ ప్రెస్ రైలు ఆరో తేదీన బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు విశాఖకు చేరుకుంటుంది. ఈ రైలులో థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్ లు ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది.


Tags:    

Similar News