Andhra Pradesh : నేడు విశాఖలో చంద్రబాబు బిజీ బీజీ

విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సుకు సంబంధించి నేటి నుంచి సన్నాహక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-11-13 01:42 GMT

విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సుకు సంబంధించి నేటి నుంచి సన్నాహక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నిన్న రాత్రి విశాఖకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వివిధ కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు. ఈరోజు హోటల్ నోవాటెల్ లో జరిగే పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా - యూరప్ కో ఆపరేషన్ ఫర్ సస్టెయినబుల్ గ్రోత్ అంశంపై ఇండియా - యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. పెట్టుబడులపై చంద్రబాబు చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం నుంచి తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ జరుగుతుంది.

వివిధ సంస్థల ప్రతినిధులతో...
ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్, రెన్యూపవన్, బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్, మురుగప్ప గ్రూపు, జ్యుయల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ప్రతినిధులతో సమావేశమై చంద్రబాబు పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. అలాగే సాయంత్రం నుంచి విశఆఖ ఎకనమిక్ రీజియన్ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత స్పెషల్ మీటింగ్ ఆఫ్ సీఐఐ నేషనల్ కౌన్సిల్ కు హాజరుకానున్నారు. రేపటి నుంచి పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభం కానున్నా నేటి నుంచి ప్రధానమైన కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతారు.


Tags:    

Similar News