విశాఖలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హనుమాన్ జయంతి శోభాయాత్ర నేపథ్యంలో విశాఖలో అనేక చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు

Update: 2023-04-15 03:04 GMT

హనుమాన్ జయంతి శోభాయాత్ర నేపథ్యంలో విశాఖలో అనేక చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. శనివారం కరాస కూడలి వద్ద హనుమాన్ యాత్ర బయలుదేరి మర్రిపాలెం, కంచరపాలెం మెట్టు, మహారాణి పార్లర్, దొండపర్తి, డైమండ్ పార్క్, ఐసీఐసీఐ బ్యాంకు, సీతంపేట రోడ్డు, గురుద్వారా కూడలి. సీతమ్మధార, అల్లూరి విగ్రహం కూడలి, హెచ్‌బి కాలనీ ఆఖరి బస్టాప్, కృష్ణా కళాశాల, ఇసుకతోట కూడలి, ఎంవీపీ కాలని రోడ్డు, ఉషోదయ కూడలి, కామత్ హోటల్ కూడలి, పార్క్ హోటల్, బీచ్ రోడ్డు మీదుగా కాళీమాత ఆలయం వరకూ సాగుతుందని చెప్పారు.

నాలుగు గంటల పాటు...
హనుమాన్ శోభా యాత్ర మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో జరుగుతుందని, అందువల్ల ఆయా మార్గాల్లో ప్రయాణించే సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు. అలా చేస్తే రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఈ విషయమై నగర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు


Tags:    

Similar News