విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్ఎంఎస్ 2లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదం ఎందుకు జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
భారీ ఆస్తి నష్టం...
ఎస్ఎంఎస్ 2లో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో పెద్దయెత్తు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి గత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరగడం, పెద్దయెత్తున ఆస్తినష్టం సంభవించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.