Janasena : నేడు విశాఖలో జనసేన బహిరంగ సభ

జనసేన పార్టీ నేడు బహిరంగ సభ విశాఖపట్నంలో నిర్వహిస్తుంది. ఈ బహిరంగ సభ ద్వారా అన్ని ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చే అవకాశముంది.

Update: 2025-08-30 02:03 GMT

జనసేన పార్టీ నేడు బహిరంగ సభ విశాఖపట్నంలో నిర్వహిస్తుంది. గత రెండు రోజులుగా పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన పవన్ కల్యాణ్ తన భవిష్యత్ ప్రణాళికను ఇప్పటికే ప్రకటించారు. మరో పదిహేనేళ్ల పాటు కూటమి కలసి ఉంటుందని పేర్కొన్నారు. అదే సమయంలో అందరు కలసి సమిష్టిగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.

సభ నుంచి...
ఈరోజు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు పెద్ద సంఖ్యలో జనసైనికులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరు కానున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా అన్ని ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చే అవకాశముంది. విపక్షంపై పోరుతో పాటు, కూటమిలో సఖ్యత వంటి అంశాలపై ఆయన క్లారిటీ ఇవ్వనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. నేటితో విశాఖలో జనసేన కార్యక్రమాలు ముగియనున్నాయి.


Tags:    

Similar News