Janasena : పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ న్యాయం.. సోషల్ మీడియా కుట్రలను తిప్పి కొట్టండి
నిజాయితీ గల జనసైనికులు, వీర మహిళలే పార్టీకి ఇంధనమని జనసేన నేత నాదెంట్ల మనోహర్ అన్నారు.
నిజాయితీ గల జనసైనికులు, వీర మహిళలే పార్టీకి ఇంధనమని జనసేన నేత నాదెంట్ల మనోహర్ అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని పవన్ హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. సమకాలీన విషయాలపై నాయకులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. సోషల్ మీడియా కుట్రలను తిప్పికొట్టాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల విషయంలో జనసేనది బలమైన పోరాటం అని చెప్పారు. జన సైనికులు కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.
పాలసీ మేకర్స్ గా...
జనసేన పార్టీ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ప్రసంగించిన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ‘పాలసీ మేకర్స్ గా, లా మేకర్స్ గా ఒకే గొంతు వినిపిస్తూ ముందుకు వెళ్దామని, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ప్రజలకు ఏది మంచి జరిగితే దానికి కట్టుబడి జనసేన పార్టీ పని చేస్తుందని తెలిపారు. యువత, మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని జనసేన పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, దీనిపై ఒక బలమైన నిర్ణయం తీసుకునేలా చట్టసభల్లో పార్టీ ప్రతినిధులు మాట్లాడతారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జన సైనికులు, వీర మహిళలు బలంగా నిలబడ్డారని పార్టీ పీఏసీ ఛైర్మన్, నాదెండ్ల మనోహర్ చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ జరగదు...
నాటి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వాటిని పవన్ కల్యాణ్ అడ్డుకోగలిగారని అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి నాయకులకు ఎదురొడ్డి విశాఖపట్నంలో పోలింగ్ స్టేషన్లలో కూర్చున్న వాళ్లను జన సైనికులు, వీర మహిళలు బయటకు రప్పించారని, అలాంటి వారికి పార్టీ కోసం నిలబడిన యువతకు ప్రాధాన్యమిస్తూ వారితో మమేకం కావాలని పవన్ కళ్యాణ్ భావించారని తెలిపారుఎంతో దూరదృష్టితో రాష్ట్రం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆలోచనలే ఈరోజు రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చేలా పని చేశాయన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖపట్నానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారనే వార్త బయటకు రాగానే మొట్టమొదట స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసి, కనీసం దీనిపై నోరెత్తకపోయినా ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసి స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయవద్దని కోరారన్నారు.